ఎంసిఏ సినిమా రివ్యూ (21/12/17)

Posted on 21 Dec, 2017 in Cinema |   0 Comments

మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/12/17..    04.30pm)
               వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని నుండి వచ్చిన మరొక చిత్రం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’. ట్రైలర్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం గురువారం విడుదలైంది.  

కథ :
                  నాని (నాని)కి తన అన్న(రాజీవ్ కనకాల) అంటే చాలా ఇష్టం. కానీ అన్నకు పెళ్ళై వదిన జ్యోతి (భూమిక) వాళ్ళ మధ్యకు రాగానే వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. దాంతో వదినపై కాస్తంత చిరాకు పెంచుకుంటాడు నాని. అదే సమయంలో పల్లవి (పల్లవి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన జ్యోతికి డ్యూటీ విషయంలో లోకల్ రౌడీ వరంగల్ శివతో గొడవ మొదలవుతుంది. దాంతో శివ ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు. దానికి నాని అడ్డుపడతాడు. గొడవ పెద్దదై శివ నాని వదినను చంపుతానంటూ ఛాలెంజ్ చేస్తాడు. ఒక సాదా సీదా మిడిల్ క్లాస్ కుర్రాడైన నాని శివ నుండి వదినను ఎలా కాపాడుకున్నాడు ? శివను ఏం చేశాడు ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్:
            మిడిల్ క్లాస్ కుర్రాడిలా నాని నటన చాలా బాగుంది. సినిమా బలహీనపడుతోంది అనే సమయానికి నాని తన నేచ్యురల్ పెర్ఫార్మెన్స్ తో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అతని మిడిల్ క్లాస్ జీవితం తాలూకు సీన్లు, వదినకి అతనికి మధ్య నడిచే చిన్నపాటి మనస్పర్ధను బయటపెట్టే సన్నివేశాలు బాగున్నాయి. నాని, సాయి పల్లవి కలిసి కనిపించే సన్నివేశాలు అందంగా కనిపిస్తూ కొంత ఆహ్లాదాన్నిచ్చాయి. మరీ పెర్ఫార్మెన్స్ చేసేంత స్కోప్ లేనప్పటికీ సాయి పల్లవి తన పాత్రలో బాగానే నటించింది. భాధ్యతగల వదినగా భూమిక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపి మెప్పించారు. సెకండాఫ్ చివరి 15 నిముషాల్లో నాని తన వదినను కాపాడుకునే సీక్వెన్స్ బాగుంది. విలన్ పాత్ర చేసిన విజయ్ పెర్ఫార్మెన్స్ వలన సినిమాలో కొంత తీవ్రత కనబడింది.

మైనస్ పాయింట్స్ :
           బలహీనత కొత్త కథంటూ లేకపోవడం. చాలా సినిమాల్లో చూసినట్టే మధ్యతరగతికి చెందిన కుర్రాడు అప్పటి వరకు ఖాళీగా ఉంటూ తన కుటుంబానికి ఆపద ఎదురైనప్పుడు హీరోలా మారిపోతాడు. ఈ సినిమా పాయింట్ కూడ. ఈ పాయింట్ ను ఆరంభంలో నాని తన నటనతో కొంత ఆసక్తికరంగానే లాగినా ఆ తర్వాత కథనంలో బలహీనత కొట్టొచ్చినట్టు బయటపడటంతో బోర్ కొట్టేసింది. ఇంటర్వెల్ కు అసలు కథ రివీల్ అయిపోవడంతో సెకండాఫ్లో ఏం జరుగుతుంది అనేది సులభంగా ఊహించేయవచ్చు. క్లైమాక్స్ లో దర్శకుడు కొంత ఎక్కువ స్వేచ్ఛను వాడేసుకోవడం వలన కొన్ని కీలక మలుపుల్లో లాజిక్స్ లోపించాయి. ఎక్కడా మెచ్చుకోదగిన రీతిలో దర్శకత్వ ప్రతిభ కనబడలేదు.  
 
 
Be the first one to comment. Click here to post comment!