స్కూలు విద్యార్థుల ఆటోను ఢీకొన్న బస్సు.. ఐదుగురు మృతి (28/12/17)

Posted on 27 Dec, 2017 in General |   0 Comments

మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (28/12/17..   10.00am)
                గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని రేపూడి గ్రామ సమీపంలో విద్యార్థులతో వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు సహా అటో డ్రైవరు అక్కడికక్కడే మృతి చెందారు. వేమవరం గ్రామం నుంచి పేరేచర్లలోగల పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆటో ఎక్కారు. ఆటోను ఫిరంగిపురం సమీపంలో శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థులు కార్తీక్‌రెడ్డి, గాయత్రి, శైలజ, రేణుక, ఆటో డ్రైవర్‌ ధన్‌రాజ్‌  అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన మరికొందరు విద్యార్థులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.
 
 
Be the first one to comment. Click here to post comment!