శ్రీశైలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి (29/12/17)

Posted on 28 Dec, 2017 in General |   0 Comments

మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (29/12/17.. 10.00am)
               ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం వైభవంగా జరుగుతోంది. ఉత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారు జామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరిచారు. సుప్రభాతసేవ, మహా మంగళ హారతి సేవలను శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్లకు ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా ముస్తాబు చేశారు. ప్రత్యేక పూజలందుకున్న శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు ఆలయ ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. దివ్యమంగళ స్వరూపంలో తరలివచ్చిన ఉత్సవ మూర్తులను రావణవాహనంపై అధిష్టింపజేశారు. మంగళవాయిద్యాల నడుమ వేదపండితులు వేద మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా పూజలు జరిపి గ్రామోత్సవానికి తీసుకువచ్చారు. శ్రీశైల పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్లకు రావణ వాహనంపై వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.
 
 
Be the first one to comment. Click here to post comment!