ఒక్క క్షణం సినిమా రివ్యూ (29/12/17)

Posted on 28 Dec, 2017 in Cinema |   0 Comments

మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (29/12/17.. 10.00am)
           అల్లు శిరీష్ హీరోగా, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ విఐ. ఆనంద్ డైరెక్ట్ చేసిన ‘ఒక్క క్షణం’ మంచి పాజిటివ్ బజ్ తో విడుదలైంది. 


కథ :
           జీవ (శిరీష్), జ్యోత్స్న (సురభి) ని షాపింగ్ మాల్ లో చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంతుంది. వారి ప్రేమ అలా కొనసాగుతూవుండగానే జ్యోత్స్న ఉండే అపార్టుమెంట్లో ఉండే శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) ల జంట యొక్క జీవితంలో జరిగే సంఘటనలే వీరి జీవితంలో కూడా జరుగుతున్నాయని గ్రహిస్తారు. అన్ని గురించి లోతుగా వెళ్లి ఆరా తీయగా ప్యార్లల్ లైఫ్ అనే అంశమే దీనికి కారణమని, అందువల్లనే శ్రీనివాస్, స్వాతిల గతం వీరికి భవిష్యత్తు అవుతోందని తెలుసుకుంటారు. అంతేగాక దాని వలన వారి ప్రేమకి పెను ప్రమాదం ఉందని కూడా కనుగొంటారు. ఇంతకీ ఆ ప్రమాదం ఏమిటి ? అసలు ఈ రెండు జంటల జీవితాలు ఎలా ఒకేలా నడుస్తుంటాయి ? ఆ ప్రమాదాన్ని జీవ ఎలా ఎదుర్కున్నాడు ? చివరికి ప్రేమ, విధిల మధ్య జరిగే సంఘర్షణలో ఏది గెలిచింది ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :
         తెలుగులో రాని ప్యార్లల్ లైఫ్స్ అనే కొత్త కాన్సెప్ట్ తో కథను ఆసక్తికరంగా తయారుచేశారు దర్శకుడు విఐ ఆనంద్. ఆయన కథలోని లింకులను కనెక్ట్ చేసిన విధానం, రెండు జంటల జీవితాలు కొంత టైమ్ గ్యాప్ తో ఒకేలా ఎలా నడుస్తాయో చూపించిన తీరు చాలా బాగుంది. ఈ స్పష్టత వలన ఎక్కడా కన్ఫ్యూజన్ అనేదే చోటుచేసుకోక చూస్తున్నంత సేపు ఒకరకమైన సంతృప్తి కలిగింది. ఇంటర్వెల్ సమయంలో కథలో వచ్చే ముఖ్యమైన ట్విస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. దాని వలన సెకండాఫ్ మీద అమితమైన క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సెకండాఫ్ నడుస్తున్నప్పుడు రివీల్ అయ్యే కథలోని కొన్ని కనెక్షన్స్, హీరో వాటిని కనిపెడుతూ ముందుకు వెళ్లడం ఉత్కంఠను కలిగించింది. హీరో శిరీష్ పెర్ఫార్మెన్స్ పరంగా మంచి పరిణితిని కనబర్చగా సీరత్ కపూర్, శ్రీనివాస్ అవసరాల జంట మీద నడిచే కథ, అందులో వారి నటన ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :
        దర్శకుడు ఎంచుకున్న కథాంశం, దాన్ని స్పష్టంగా వివరించడానికి తయారుచేసుకున్న కథనం బాగానే ఉన్నా అందులో రాసుకున్న సన్నివేశాలే కొంత బలహీనంగా కనబడ్డాయి. కొన్ని ముఖ్యమైన మలుపుల్లో తప్ప ఎక్కడా కథలో తీవ్రతను బలంగా బయటపెట్టే సన్నివేశాలు లేవు. సినిమా ఆరంభం ఎలాగైతే సాధారణంగా ఉందో ఇంటర్వెల్, సెకండాఫ్ కొన్ని చోట్ల మినహా మిగతా అంతా అలాగే కొనసాగింది. దీంతో కొన్ని చోట్ల సన్నివేశాలు రిపీట్ అవుతున్నట్టు అనిపించి బోర్ కొట్టిన ఫీల్ కలిగింది. ఇక ముందుగానే ఊహించగలిగే రొటీన్ క్లైమాక్స్ ను కూడా అవసరాన్ని మించి సాగదీశారు. ఇక కమెడియన్లు సత్య, ప్రవీణ్ లు చేసిన ఫన్ అక్కడక్కడా పండినా కొన్ని చోట్ల కథనానికి అడ్డుతగులుతున్నట్టు అనిపించాయి.
 
 
Be the first one to comment. Click here to post comment!