2 కంట్రీస్ సినిమా రివ్యూ (29/12/17)

Posted on 29 Dec, 2017 in Cinema |   0 Comments


మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (29/12/17.. 04.30pm)
                 సునీల్ హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలోరూపొందిన ‘2 కంట్రీస్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


కథ:
        ఉల్లాస్ (సునీల్) వెంకటాపురంలో సరదాగా జీవితాన్ని గడిపే కుర్రాడు. డబ్బుకోసం సిమ్రన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అనుకోకుండా లయ (మనీష రాజ్ ) తో అతని వివాహం జరుగుతోంది. ఆ తరువాత ఉల్లాస్, 
లయకు మద్య విభేదాలు వచ్చి వ్యవహారం విడాకులు వరకు వెళుతుంది. తరువాత తన తప్పు తెలుసుకొని లయతో కలిసి బ్రతుకుదాం అనుకుంటాడు. చివరికి వీరిద్దరూ కలిసారా ? సిమ్రాన్ అనే అమ్మాయి ఉల్లాస్ జీవితంలోకి ఎలా వచ్చింది ? ఉల్లాస్, లయ మద్యల మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి ? తెలుసుకోవాలంటే 2 కంట్రీస్ చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
           సినిమా మేకింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అమెరికాలో చిత్రీకరించిన సన్నివేశాలు రిచ్ గా ఉన్నాయి. సునీల్ కామెడి టైమింగ్ బాగుంది. శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి హీరోతో సమానమైన పాత్రల్లో నటించి మెప్పించారు. కొత్త అమ్మాయి మనీష రాజ్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదటి సినిమానే అయినా ఆమె తన నటనతో ఆకట్టుకుంది. కమెడియన్ శివారెడ్డి చేసింది చిన్న పాత్రే అయినా బాగా చేసాడు. విలన్ క్యారెక్టర్ లో దేవ్ గిల్ నటన సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :
         మలయాళంలో ఒక మోస్తరుగా ఆడిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తియ్యడంలో దర్శకుడు ఎన్.శంకర్ విఫలమయ్యార ని చెప్పాలి. కథ పరువాలేదు అనిపించినా కథనం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. చాలా మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ హాస్యం అంతంత మాత్రంగానే ఓనిది తప్ప ఎక్కడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. పాత సన్నివేశాలు, పసలేని స్క్రీన్ ప్లే ఉండడంతో కాస్తంత చిరాకు కలిగింది. సినిమా నిడివి చాలా ఎక్కువ ఉండడంతో ఆడియన్స్ సహనం కోల్పోతారు. సినియర్ యాక్టర్ నరేష్ చేసిన పాత్ర అస్సలు ఆకట్టుకోదు సరికదా అసహజంగా తోచింది. తెలుగుని ఖూని చేస్తూ అతను మాట్లాడిన డైలాగ్స్ విసుగు తెప్పిస్తాయి. ఝాన్సీ క్యారెక్టర్ అస్సలు పండలేదు. ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి అస్సలు సంభంధం ఉండదు. కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు వెళ్తున్నాయో అర్ధం కాకపోవడం సినిమాకు ప్రధాన బలహీనత. 
 
 
Be the first one to comment. Click here to post comment!