స్వచ్ఛ భారత్ పక్షోత్సవాల్లో ఓఎన్జీసి సైకిల్ ర్యాలీ (30/12/17)

Posted on 30 Dec, 2017 in General |   0 Comments


మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (30/12/17.. 04.30pm)
                స్వచ్ఛ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా రాజమండ్రి ఓఎన్జీసి ఆధ్వర్యంలో శనివారం అవగహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎపి ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ ప్రతిపౌరుడు ఆరోగ్యవంతంగా ఉండటానికి సైకిల్ నడపడం, పరిశుభ్రంగా పరిసరాలను ఉంచాలని అన్నారు. అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ మాట్లాడుతూ కాలుష్యరహిత దేశంగా ఉండటానికి బాధ్యత గల ప్రభుత్వరంగ సంస్థగా ఇంధన రంగంలోనే ఓఎన్జీసి మేటిగా వ్యవహరిస్తోందని అన్నారు. అనంతరం ఓఎన్జీసి సిబ్బంది, ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు సుమారు 400 మంది స్వచ్ఛ భారత్, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సూత్రాలపై ప్రజలలో అవగహన కల్పిస్తూ రాజమండ్రి నుంచి ఏలూరు వరకు సైకిల్ ర్యాలీ సాగింది.
 
 
Be the first one to comment. Click here to post comment!