జై సింహ సినిమా రివ్యూ (12/1/18)

Posted on 12 Jan, 2018 in Cinema |   0 Comments


మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/01/18..    04.30pm)
             నట సింహం నందమూరి బాలక్రిష్ణ నటించిన 102వ చిత్రం ‘జై సింహ’ భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదలైంది.  

కథ:
            నరసింహ (బాలక్రిష్ణ) అప్పుడే పుట్టిన తన కొడుకుతో వైజాగ్ వదిలేసి అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు తిరుగుతూ చివరికి కుంభకోణంకు చేరుకుంటాడు. అక్కడే డ్రైవర్ గా పని చేసుకుంటున్న అతనికి ఒక ఇన్సిడెంట్ ద్వారా గతంలో తాను ప్రేమించిన అమ్మాయి గౌరి (నయనతార) ఎదురవుతుంది. కానీ అప్పటికే ఆమె అతనిపై ద్వేషం పెంచుకుని, అసహ్యించుకునే స్థాయిలో ఉంటుంది. అసలు నరసింహ కొడుకుతో సహా వైజాగ్ వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు ? ప్రాణంగా ప్రేమించిన గౌరి అతన్ని ఎందుకు శత్రువులా చూస్తుంది ? అతని గతమేమిటి ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :
             ఫస్టాఫ్ కుంభకోణం బ్యాక్ డ్రాప్లో వచ్చే బ్రహ్మాణుల గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వివరించే సన్నివేశం చాలా బాగుంది. అందులో కట్ లేకుండా బాలయ్య చెప్పిన డైలాగ్ ఔరా అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తించింది. ద్వితియార్థంలో బాలయ్య గత జీవితం తాలూకు ముఖ్యమైన ఘటనలు, అతనెందుకు వైజాగ్ వదిలి వచ్చేశాడనే అంశం కొంత బాగానే ఉంది. అలాగే క్లైమాక్స్ సన్నివేశమైతే గుండెల్ని కొంత బరువెక్కించి బయటికిపంపుతుంది. పైన చెప్పినట్టు అందులో బాలయ్య నటన, సన్నివేశం తాలూకు దర్శకుడు సృష్టించిన పరిస్థితులు బాగుంటాయి.

మైనస్ పాయింట్స్ :
              సినిమాలో కొత్త కథంటూ ఏముండదు. బాలక్రిష్ణ గత హిట్ సినిమాల తాలూకు ఛాయలు ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటాయి. దాంతో సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి పెద్దగా ఎగ్జైట్ ఫీలయ్యే ఛాన్స్ దొరకదు. అంతేగాక కె.ఎస్. రవికుమార్ స్క్రీన్ ప్లే కూడా పాత తరహాలోనే ముందు హీరో ప్రస్తుతం, ఆ తర్వాత అతని గతం, చివర్లో మళ్ళీ ప్రస్తుతం అన్నట్టే ఉంటుంది కానీ ఎక్కడా కొత్త పోకడ, వేగం కనిపించదు. ఫస్టాఫ్లో వచ్చే బ్రహ్మానందం తాలూకు కామెడీ ఓల్డ్ ఫార్మాట్లోనే ఉంటూ ఒకానొక దశలో ఇక చాలు అనే ఫీలింగ్ ను కూడా కలిగిస్తుంది. కథానానికి ముఖ్యమైన ప్రతినాయకులు, హీరో మధ్య వైరం చాలా బలహీనంగా ఉండటంతో బాలయ్య పాత్రలో కూడా తీవ్రత కొంత లోపించింది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించి ఉంటే ఫలితం ఇంకాస్త బెటర్ గా ఉండేది. సెకండాఫ్లో వచ్చే ముఖ్యమైన బాలయ్య గత జీవితం చెప్పడానికి, వినడానికి బాగానే ఉంది కానీ చూడటానికి అంత ఆసక్తికరంగా, ఎగ్రెసివ్ గా లేదు. ముఖ్యంగా కథానాయకుడి పాత్ర స్వభావాన్ని, అతని లవ్ ట్రాక్ ను వివరించడానికి తీసిన సన్నివేశాలు మరీ రొటీన్ గా ఉండి కొంత బోర్ ఫీలయ్యేలా చేస్తాయి. కొందరు ముఖ్యమైన నటుల నటన అస్సలు బాగోలేదు.
 
 
Be the first one to comment. Click here to post comment!