గ్యాంగ్ సినిమా రివ్యూ (12/1/18)

Posted on 12 Jan, 2018 in Cinema |   0 Comments

మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/01/18..    04.30pm)
                సూర్య- కీర్తిసురేష్ జంటగా నటించిన సినిమా ‘గ్యాంగ్’. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

కథ:
             ఉత్తమ్ దాస్ (సూర్య) ఉద్యోగం కోసం ప్రయత్నించే ఒక సాధారణ పౌరుడు. అలాంటి సమయంలో తన స్నేహితుడు తన చదువుకు సరైన జాబ్ రాలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆ సంఘటన తరువాత చలించిపోయిన ఉత్తమ్ వ్యవస్థలో నిజాయితీ లేదని గుర్తిస్తాడు. తన స్నేహితుడికి జరిగిన దుస్థితి మరెవరికి జరగరాదని సిద్ధపడతాడు. ఆ తర్వాత అతనేం చేశాడనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:
                     సమాజంలో చదువుకు తగ్గ ఉద్యోగం ఎవ్వరికీ అందడం లేదు. పలుకుబడితో జనాలు డబ్బులు కట్టి దొంగదారిన జాబ్స్ సంపాదించుకుంటున్నారు. ఇలాంటి వ్యవస్థపై హీరో చేసే యుద్ధం బాగుంది. సీబీఐ ఆఫీసర్ గా ఒక సామాన్య పౌరుడిగా రెండు విభిన్న పాత్రల్లో బాగా నటించాడు సూర్య. కీర్తి సురేష్ కూడా పద్ధతి గల అమ్మాయిగా సాంప్రదాయ దుస్తుల్లో బాగా కనిపించింది. ఆర్.జె బాలాజీ చేసింది చిన్న పాత్రే అయినా కామెడి టైమింగ్ తో మెప్పించాడు. రమ్య కృష్ణ ఈ సినిమాలో ఫుల్ లెన్త్ సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. సూర్య , రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. సూర్య సొంతంగా ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. సినిమా మొత్తం ఆయన వాయిస్ ఎక్కడా తడబడకుండా నీట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో హీరో తన గ్యాంగ్ తో చేసే రాబరీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్ బాగుంది. తరువాత ఏంజరుగుతుందనే ఆసక్తి కలిగేలా దర్శకుడు దాన్ని చిత్రీకరించాడు. 1980’ల కాలంలో సెట్ చేసిన సినిమా నైపథ్యం బాగుంది. కొన్ని సోషల్ ఇష్యూలను వివరించితిన్ విధానం కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్:
                  సినిమాను ఎంటర్టైనింగానే నడిపినా సన్నివేశాల్లో, కథనంలో పెద్దగా లోటు కనిపించలేదు. దీంతో సినిమాలో సీరియస్ నెస్ లోపించింది. ఇంటర్వెల్ తరువాత కూడా సినిమా కొద్దిసేపు నిధానంగానే సాగింది. పైగా ఈ ద్వితీయార్థం మొత్తం తమిళ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. అనిరుధ్ అందించిన పాటలు ఒకటి రెండు తప్పా మిగతావి పెద్దగా ఆకట్టుకోలేదు. సెకండాఫ్లో హీరో గ్యాంగ్ కొన్ని దొంగతనాలు చేస్తారు. భారీ సెక్యూరిటీ ఉండగా జరిగే ఆ దొంగతనాలు ఎలా సాధ్యపడ్డాయనే విషయాలను ఇంకాస్త క్లారిటీగా చూపించి ఉంటే బాగుండేది. అంతేగాక క్లైమాక్స్ కూడా హడావుడిగా ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేకుండా ముగిసిపోవడంతో కొంత అసంతృప్తి కలిగింది.
 
 
Be the first one to comment. Click here to post comment!