విశాఖలో ‘కరెంట్‌ కారు’ సందడి!

Posted on 09 Mar, 2018 in General |   0 Comments

మాకాకినాడ డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/03/18..   09.30am)
           రాష్ట్రంలో విద్యుత్‌ కారు సందడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖ కలెక్టరేట్‌లో తొలి విద్యుత్‌ కారు పరుగులు పెట్టింది. పర్యావరణ పరిరక్షణకు తోడు సుస్థిరాభివృద్ధికి ఈ సాంకేతికత తోడ్పడనుంది. అత్యాధునిక సాంకేతికతను ఒడిసిపడుతున్న చంద్రబాబు సర్కారు విద్యుత్‌ కార్ల విషయంలో అప్పుడే ముందడుగు వేసింది. దేశంలోనే మొదటిసారిగా ఓ ఎలక్ట్రిక్‌ కారు ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టింది. విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వయంగా ఈ విద్యుత్‌ కారును నడిపారు. ఎలాంటి శబ్దం చేయని.. కాలుష్యం వూసే లేని ఎలక్ట్రిక్‌ కారు అందరినీ ఆకట్టుకుంటోంది. విశాఖలో ఇటీవల భారీ స్థాయిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో విద్యుత్‌ కారును ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. 
 
 
Be the first one to comment. Click here to post comment!