హైదరాబాద్‌-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు (21/4/18)

Posted on 20 Apr, 2018 in General |   0 Comments

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/4/18.. 10.00am)
            ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ - కాకినాడ మధ్య  గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్‌ మండల వాణిజ్య అధికారి ఉమామహేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్లే ప్రత్యేక రైలు (నెం.07075) హైదరాబాద్‌లో 18.50 గంటలకు బయలుదేరి పిడుగురాళ్ల 22.42, గుంటూరు 00.15, విజయవాడ 01.20, కాకినాడ 07.45 గంటలకు చేరుతుందని తెలిపారు. తిరుగుప్రయాణంలో ఈ రైలు (నెం.07076) ఈనెల 27న కాకినాడలో 18.10 గంటలకు బయలుదేరి విజయవాడ 23.05, గుంటూరు 00.20, పిడుగురాళ్ల 01.35, హైదరాబాద్‌ 06.50 గంటలకు వెళ్తుందని తెలిపారు. అదే విధంగా ఈనెల 21న ప్రత్యేక రైలు(నెం.07002) కాకినాడలో 20.15 గంటలకు బయలుదేరి విజయవాడ 01.00, గుంటూరు 02.10, హైదరాబాద్‌ 08.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈనెల 22న ప్రత్యేక రైలు(నెం.07240) కాకినాడలో 18.10 గంటలకు బయలుదేరి విజయవాడ 23.05, గుంటూరు 00.20, సత్తెనపల్లి 01.18, పిడుగురాళ్ల 01.35, నడికుడి 02.10, సికింద్రాబాద్‌ 06.00 గంటలకు చేరుతుందని తెలిపారు.  
 
 
Be the first one to comment. Click here to post comment!